కాంగ్రెస్ పార్టీ లొకి భారీగా చేరికలు..n

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యే అనుచరులు పల్లెగడ్డ వెంకటయ్య, గడ్డం రవి, చందు, నర్సింహులు గౌడ్, మద్దూరు మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ డి.వెంకట్‌రెడ్డి, సర్పంచులు ఎస్.లింగారెడ్డి, ఎం.యాదగిరి, మాజీ సర్పంచ్ ఏ.సుబ్బారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ వెంకటేశం, ఉపసర్పంచ్ కుంట రేవతి-లింగమూర్తి, వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు…
కాంగ్రెస్‌లో చేరిన ఓయూ, కేయూ విద్యార్థి నేతలు..
ఓయూ నేత కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓయూ, కేయూ విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక విద్యార్థులు చేరారు. తెలంగాణ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెంచాల సతీష్, SFI మాజీ ఓయూ అధ్యక్షులు Dr మాండ్ల రవి, TYF రాష్ట్ర అధ్యక్షులు మోహన్‌రాజ్, TVS కాకతీయ యూనివర్సిటీ నాయకులు కూనూరి రంజిత్, TSP JAC స్టేట్ చైర్మన్ K.చంద్రశేఖర్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.