కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే..

బ్రేకింగ్..
*పెండింగ్లో ఉన్న నాలుగు స్థానాలకు కాంగ్రెస్ తుది జాబితా విడుదల* పటాన్చెరు సెగ్మెంట్లో అభ్యర్థి మార్పు

కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే..

పటాన్ చెరువు – కట్టా శ్రీనివాస్ గౌడ్

తుంగతుర్తి – మందుల సామెల్

సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి

మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి

చార్మినార్ – ముజీబ్ షరీఫ్

*గతంలో ప్రకటించిన పటాన్చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పేరు మార్పు,
కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయింపు….
చివరి నిమిషం వరకూ పటాన్ చెరు అభ్యర్థి విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడినట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే నీలం మధుకు మొదట టికెట్ కేటాయించడం ఆ తర్వాత అభ్యర్థిని మార్చాల్సిందేనని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా పట్టుబట్టడం.. మారిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని జగ్గారెడ్డి ఏకంగా మార్పు జరిగితే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరికలే జారీ చేయడంతో పెద్ద పంచాయితీగా మారింది. అయితే చివరికి అభ్యర్థిని మార్చేయడంతో దామోదర పంతం నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారనేది ఆయనకే తెలియాలి మరి.