కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి. ..!!?

*కర్ణాటక*

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న BRS నేత,మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

నిన్న బెంగళూరు సిటీలో ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయిన మల్లారెడ్డి..

రేపు ప్రియాంక గాంధీనీ కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరిన మల్లారెడ్డి ఫ్యామిలీ…

*కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తు న్నాయి తాజా పరిణామా లు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది.బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌ తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరు వురు దాదాపు సిద్ధమ య్యారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్ర వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది…

ఈ వార్త ఎంతవరకు నిజమనేది ఆయన స్పందిస్తేనే తెలుస్తుంది… ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది..