కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా విడుదల కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీకి సిద్దం..

కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా విడుదల

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీకి సిద్దం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపధ్యంలో 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మూడో లిస్టు విడుదల చేసింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు..

తెలంగాణలోని 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాల పై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు..కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని తుది జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు విరే..

1. చెన్నూరు- వివేకానంద్(వివేక్).
2. బోథ్- ఆదే గజేందర్ (వన్నెల అశోక్ స్థానంలో)
3. జుక్కల్- లక్ష్మీకాంతారావు
4. బాన్సువాడ- ఏనుగు రవీందర్ రెడ్డి
5 .కామారెడ్డి- రేవంత్ రెడ్డి
6 .నిజామాబాద్ అర్బన్- షబ్బీర్ అలీ
7. కరీంనగర్- పురుముళ్ల శ్రీనివాస్
8. సిరిసిల్ల- మహేందర్ రెడ్డి
9. నారాయణ్ ఖేడ్- సురేశ్ షెట్కార్
10. పటాన్ చెరు- నీలం మధు ముదిరాజ్
11. వనపర్తి – తుడి మేఘా రెడ్డి(చిన్నారెడ్డి స్థానంలో)
12. డోర్నకల్ – రామచంద్రు నాయక్
13. ఇల్లందు- కోరం కనకయ్య
14. వైరా – రాందాస్ మాలోత్
15. సత్తుపల్లి- మట్ట రాగమయి
16. అశ్వారావుపేట- ఆదినారాయణ.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడవ విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు..
ఇల్లందు – కోరం కనకయ్య
సత్తుపల్లి – మట్టా దయానంద్ రాగమయి
వైరా – రాం దాస్ నాయక్
అశ్వరావుపేట – జారే ఆదినారాయణ.