కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థు ల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.

న్యూఢిల్లీ : లోక్‌స‌భ అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితా విడుద‌లైంది. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల‌కు గానూ తొలి జాబితాలో కేవ‌లం నాలుగు స్థానాల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది కాంగ్రెస్ అధిష్ఠానం. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ స్థానం నుంచి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ ఈ స్థానాన్ని ప్ర‌క‌టించ‌కుండా కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్‌లో పెట్టింది…

దేశవ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుండి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిం చారు.

జహీరాబాద్- సురేష్ షట్కర్, చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ – కుందూరు రఘువీర్, మహబూబాబాద్ – బలరాం నాయక్ పేర్లను ఏఐసీసీ అనౌన్స్ చేసింది.

మహబూబ్ నగర్ పార్ల మెంట్ స్థానానికి స్వయంగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిం చిన పేరును ఏఐసీసీ హోల్డ్‌లో పెట్టింది. ఇటీవల కోస్గిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు.

వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించిన అభ్యర్థి పేరును ఫస్ట్ లిస్ట్‌లో అధిష్టానం హోల్డ్‌లో పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లోకి హాట్ టాపిక్‌గా మారింది…