వెనక్కి తగ్గను అంటున్న ఆ ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్..

వెనక్కి తగ్గను అంటున్న ఆ ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్

సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను. నేను పోటీలో ఉంటాను. పోటీ నుండి తప్పుకోమని నన్నెవరూ అడగలేదు. రేవంత్ రెడ్డి కూడా నాతో మాట్లాడలేదు. బుజ్జగింపులకు తలొగ్గేది లేదు – పటేల్ రమేష్ రెడ్డి..

నన్ను మోసం చేసి నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వరంగల్ వెస్ట్‌లో నాయినిని గెలవనివ్వను.. పోటీ నుండి వెనక్కి తగ్గను – జంగా రాఘవ రెడ్డి..

కాంగ్రెస్ అధిష్టాన దూతలపై సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి రివర్స్ ఎటాక్

నామినేషన్ ఉపసంహరించుకుని కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని, బుజ్జగించేందుకు రమేష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన అధిష్టాన పెద్దలు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మల్లు రవి.

కాంగ్రెస్ అగ్ర నేతల ముందు బోరున విలపించిన రమేష్ రెడ్డి. తనకు రెండోసారి హ్యాండ్ ఇచ్చారని రమేష్ రెడ్డి ఆవేదన.

ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తనకే మద్దతు ఇవ్వాలని అధిష్టాన పెద్దలను విజ్ఞప్తి చేసిన రమేష్ రెడ్డి.

బుజ్జగింపులకు వెనక్కు తగ్గని రమేష్ రెడ్డి…

పటేల్ రమేష్ రెడ్డి ఇంటిదగ్గర ఉద్రిక్తత…

పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించడానికి వెళ్లిన మల్లు రవి, రోహిత్ చౌదరి మీద దాడికి యత్నించిన పటేల్ రమేష్ రెడ్డి అనుచరులు..

పటేల్ రమేష్ రెడ్డితో భేటీ అయిన గదిపై రాళ్లతో దాడి చేసిన రమేష్ రెడ్డి అనుచరులు…