రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అంటూ టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపణ….

హస్తం పార్టీలో అసంతృప్తుల సెగ లు....

మొదటి విడత జాబితా వెలువడగానే హస్తం పార్టీలో అసంతృప్తుల సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మేడ్చల్, మల్కాజిగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆశావహుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. పలువురు రేవంత్‌తో పాటు పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పలువురు కాంగ్రెస్ అసంతృప్త నాయకులు రేవంత్‌పై తిట్ల వర్షం కురిపించారు. రేవంత్ బాధితులను తీసుకొని కోడంగల్‌లో రేవంత్‌ను ఓడిస్తామని పలువురు శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు..

రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అంటూ టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆరోపణ..

రేవంత్ రెడ్డి 60 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నాడు. గద్వాల టికెట్‌ను 10 కోట్లు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నాడు.

ఉద్యమకారులకు, ఎన్నో ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డవాళ్లకు టికెట్ ఇవ్వకుండా పారాచూట్ నాయకులకు టికెట్ ఇచ్చాడు.

నాడు ఓటుకు నోట్… నేడు సీటుకు నోటు అంటూ గన్‌పార్క్ దగ్గర టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ ఆందోళన..

రేవంత్ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు.. నాలాంటి రేవంత్ బాధితులను కలుపుకుని కొడంగల్లో ఆయన్ని ఓడగొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఉప్పల్ లో నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను అని సర్వేలన్నీ చెప్పాయి. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండు సీట్లయితే.. మా భార్య కార్పొరేటర్ గా గెలిచిందన్నారు. గత తోమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశా. పార్టీ సచ్చిపోతుంది అనుకున్నప్పుడు పార్టీలో ఎవరు లేరు. నేను రేవంత్ రెడ్డికి సన్నిహితుడిని.. ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్న. 2014లో టికెట్ అన్నారు.. ఆ తరువాత 2018లో అన్నారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదు. పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడని మండిపడ్డారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడు. టీడీపీ లాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నాడని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

మేడ్చల్, మల్కాజిగిరిలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్య యాదవ్‌కు కేటాయించడంతో అదే టికెట్ ఆశించిన కాంగ్రెస్ జిల్లా జెడ్పీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. కీసర కాంగ్రెస్ కార్యాలయంలో హరివర్దన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 18 మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో హరివర్దన్ రెడ్డి చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.