కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ రాష్ట్రంలోకి ఎంట్రీతో ఆపార్టీ కి చెందిన ఇద్దరు కీలక నేతలు పార్టీ కి రాజీనామా చేస్తారు..!! ..మంత్రి కేటీఆర్…!!!

మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్…

సుషీ ఇన్ ఫ్రా పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నారని, రూ.5 వేల కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా కు రాజగోపాల్ మాట ఇచ్చారని ఆరోపించారు. తమపై ఐటి, ఈడి, సిబిఐ లను వేట కుక్కల ప్రయోగిస్తారని, తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పనీ కథమైందని, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు త్వరలో వారు ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు, అయితే ఈ ఎంపీలు ఎవరో, వారి రాజకీయ భవిష్యత్తును ప్రజలు త్వరలోనే గుర్తిస్తారని పేర్కొన్నారు…

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ రాష్ట్రంలోకి రాకముందే తెలంగాణలోని ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు త్వరలో పార్టీని వీడనున్నట్లు టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు..కాంగ్రెస్ ఎంపీల పార్టీ మార్పుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తన వద్ద ఉందని కేటీఆర్ నొక్కి చెప్పారు..