కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మరోసారి విభేదాలు..!

పార్టీలో చేరికలపై కనీస సమచారం లేదు.. రేవంత్‌పై ఉత్తమ్ సీరియస్..!

కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరోసారి విభేదాలకు కారణమయ్యాయి. పార్టీలో చేరికలను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే ఇదే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చెబితే ఎవరినైనా చేర్చుకుంటారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.

నల్గొండ రాజకీయాలతో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఏం సంబంధం అని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి సైతం చేరికలపై సీరియస్ గా ఉన్నారని ప్రచారం సాగినా రేవంత్ రెడ్డి నేడు నేరుగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావడం, చేరికలపై విభేదాలు లేవని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంశం హాట్ టాపిక్‌గా మారింది.