అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు సమాచారం. ఈ నెల 17న తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని సమాచారం.
అలాగే పాలేరు సీటు విషయంలో కాంగ్రెస్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో.. తుమ్మల అయోమయంలో పడినట్లు టాక్…
సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కాంగ్రెస్(Congress) లోకి వెళ్లడం ఖరారయింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు బ్రేకులు పడ్డాయి…
పాలేరు వ్యవహారం తేలుతుందా..?
రాహుల్(Rahul) యూరప్(Europe) పర్యటన ముగించుకుని భారత్(India) కు వచ్చిన అనంతరం తెలంగాణలో రెండు రోజులపాటు సీడబ్ల్యూసీ(CWC) సమావేశం కానుంది. ఈ క్రమంలోనే పదిహేడో తేదీన తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ(TPCC) సన్నాహాలు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సహా పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమంకు హాజరుకానున్నారు. అదే రోజున తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆలోపు వైఎస్ షర్మిల(YS Sharmila) వ్యవహారం, పాలేరు అభ్యర్థిత్వం, వామపక్షాలతో పొత్తు అంశంపై స్పష్టత వస్తుందనే భావనలో ఉన్నారు తుమ్మల. బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy)తో పాటు మరికొందరు నేతలు నేరుగా కలిసి కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించడంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది..
జాతక రీత్యా కూడా బ్రేక్ పడుతుందా..!!.
కాంగ్రెస్‌లో తుమ్మల చేరికకు బ్రేకులు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం..