మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ అధినేత్రి….. సోనియా గాంధీ…!

*మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ అధినేత్రి….. సోనియా గాంధీ…!*

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను ప్రకటించారు.తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీ హామీలతో పాటు సోనియాగాంధీ ప్రకటించిన మొత్తం హామీల లిస్టు ఇదే..

*మహాలక్ష్మీ పథకం* *ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం*

*రూ.500 లకే గ్యాస్ సిలిండర్*

*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం*

*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం*

*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం..

*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం.

*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్..

*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు..

*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్.

*రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు..