రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారంపై రాహుల్ ఈ భేటీలో క్లారిటీ..!!!

రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారంపై రాహుల్ ఈ భేటీలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు ఉండబోదని..ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ నేతలకు సూచించినట్లు సమాచారం. బీజేపీ కావాలని దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, నధీమ్ జావిద్, రోహిత్ చౌదరి, మధుయాష్కి గౌడ్, వి. హన్మంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కోసం మంతానాలు జరిపారు. వీరంతా దాదాపు అరగంటపాటు చర్చించారు. కర్ణాటకలో హుమనాబాద్ నుండి నేరుగా శంషాబాద్ లో దిగిన రాహుల్ గాంధీ రాష్ట్ర నేతల భేటీ తర్వాత 4:30 నిమిషాలకు ఇండిగో విమానంలో తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.