గణతంత్ర వేడుకలకు మార్గదర్శకాలు జారీ అన్ని చోట్ల ఉదయం 10గంటలకే..జెండావిష్కరణ..

*కొవిడ్ ఎఫెక్ట్..*

R9TELUGUNEWS.COM.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనసమ్మర్దం లేకుండా, జనం గుమిగూడకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖాధిపతులు, రాష్ట్రంలో అన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం విధిగా చేయాలని శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయాలని అన్న ప్రభుత్వం ఆదేశించింది. 10 గంటలకు ముందు జెండావిష్కరణ చేయొద్దని సూచించారు. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించి వేడుకలు జరపాలని స్పష్టం చేసింది..