వృత్తిప‌రంగా వ్యాక్సినేష‌న్ వివ‌క్షే.. సుప్రీంకు తేల్చి చెప్పిన కేంద్రం

వృత్తిప‌రంగా వ్యాక్సినేష‌న్ వివ‌క్షే.. సుప్రీంకు తేల్చి చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: వృత్తి‌ని బ‌ట్టి వ్యాక్సినేష‌న్ ప్రాధాన్య‌త నిర్ణ‌యించ‌డం వివ‌క్షే అవుతుంద‌ని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. జడ్జీలు, లాయ‌ర్ల‌కు వ్యాక్సిన్లు ఇచ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని దాఖ‌లైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై సోమ‌వారం జ‌రిగిన‌ విచార‌ణ సంద‌ర్భంగా కేంద్రం ఈ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇది జాతి ప్ర‌యోజనాల‌కు విరుద్ధ‌మ‌ని కూడా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేక కేట‌గిరీగా ప‌రిగ‌ణించి లాయ‌ర్ల‌కు కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం సాధ్యం కాదు. వృత్తిప‌రంగా వ్యాక్సినేష‌న్ ప్రాధాన్య‌తా క్ర‌మం నిర్ణ‌యించ‌డం జాతి ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధం. ఇది వివ‌క్షే అవుతుంది అని త‌న అఫిడ‌విట్‌లో కేంద్రం స్ప‌ష్టం చేసింది. ప్రాధాన్య‌తా క్ర‌మంలో జ‌డ్జీలు, న్యాయ‌శాఖ ఉద్యోగులు, లాయ‌ర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ ఈ పిల్ దాఖ‌లైంది.