మాస్క్‌ లేని వారిని రానిస్తే షాప్ యాజమాన్యాలకు భారీ జరిమానా. ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు..

మాస్క్‌ లేని వారిని రానిస్తే షాప్ యాజమాన్యాలకు భారీ జరిమానా.

మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.

R9TELUGUNEWS.COM :

ఏపీలో కొవిడ్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని వారికి రూ.100 జరిమానా వేయనున్నారు. మాస్క్‌ లేని వారిని దుకాణాలకు రానిస్తే యాజమాన్యాలకు భారీగా జరిమానా విధించనున్నారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు 2 రెండు రోజుల పాటు వ్యాపార సంస్థలను మూసివేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్‌ ద్వారా 80109 68295 నంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఆదేశించింది…