అరుదైన జాతి ఆవు మృతి… ఆన్ని రకాల పోటీలో గెలిచినా అవు..

*పుంగనూరు అందాల రాణి కన్నుమూత*

తెలుగు రాష్టాలలో ఎన్నో బహుమతులందుకుంది.

పుంగనూరు జాతి వృద్దికి దోహదపడింది..

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పశువుల అందాల పోటీలు జరిగినా ఆ పుంగనూరు ఆవుదే మొదటి బహుమతి. పాల పోటీల్లో కూడా తనదే పైచేయిగా ఉండేది. 21 సంవత్సరాల వయసున్న ఈ పుంగనూరు గోవు వందలాది ఆవుల సంతతికి దోహదపడింది. అటువంటి అరుదైన ఆవు శుక్రవారం మృతి చెందింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన
రెడ్డి సత్యనారాయణ మూర్తి ఈ ఆవు దూడను భీమవరం నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. అప్పట్లో పుంగునూరు ఆవుజాతి ఈ ప్రాంతంలో దాదాపు అంతరించిపోయింది. అలాంటి సమయంలో ఈ ఆవుదూడ తోపాటు గిత్తను కూడా కొనుగోలు చేసారు. ఆ రెండిటి సంతతి వందలాది పుంగనూరు ఆవులను వృద్ది చెందాయి. పట్టమని నాలుగు అడుగులు ఎత్తు కూడా ఉండని ఈ ఆవు ఎక్కడ పశువుల అందాల ఫోటో జరిగిన నిర్వాహకులు వెంటనే బహుమతి ఇచ్చేసేవారు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు,ఉన్నతాధికారులు ఈ ఆవు పక్కన నిలబడి ఫోటోలు తీయించుకోవడానికి పోటీ పడేవారు. ఇప్పటికే 14 ఈతలలో ఆరోగ్యకరమైన దూడలు జన్మించాయి. వారం రోజుల్లో 15వ ఈతకు జన్మనివ్వాల్సి ఉండగా శుక్రవారం కన్ను మూసింది.ఆ రైతు ఇంట దుఃఖాన్ని మిగిల్చింది.
ఈ ఆవు మృతి వార్త తెలియగానే అనేకమంది రైతులు వచ్చి నివాళులు అర్పించారు. శాస్త్రోక్తంగా అవుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు, ఎంపీటీసీ యార్లగడ్డ రమేష్ చౌదరి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ గోవు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు.