కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తం.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు..

కాంగ్రెస్, సీపీఐ పొత్తు చర్చలు అవాస్తమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎవరూ తమతో మాట్లాడ లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్ కు మద్దుతు ఇచ్చాయి. ఆ మేరకు రెండు పార్టీల క్యాడర్, అభిమానులు బీఆర్ఎస్ కు ఓటేశారు…ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు ఉంటుందని భావించారు. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐ చెరో మూడు స్థానాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగింది. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాక కమ్యూనిస్టుల వల్లే గెలిచామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు క్రమంగా కమ్యూనిస్టులను దూరం పెడుతూవచ్చారు. సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ విముఖత వ్యక్తం చేసింది…