సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ ఓ బ్రోతల్‌ స్వర్గం-నారాయణ

సంచలన వ్యాఖ్యలు చేయటంలో ముందుండే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ పైన ప్రతీ సందర్భంలోనూ విరుచుకుపడే నారాయణ ఈ సారి తీవ్ర వ్యాఖ్యలతో కలకలం రేపారు. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ నిర్వహణ నున కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని నారాయణ డిమాండ్ చేసారు. అదే విధంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను పెడదోవ లోకి నెడుతున్నారని..ఈ పేరుతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు… బిగ్ బాస్ బ్రోతల్ స్వర్గమంటూ బిగ్ బాస్ హౌస్ పేరుతో ఒకే చోట 40 రోజుల పాటు యువతీ – యువకులను బంధించటం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఇదే అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బిగ్‌బాస్‌ కార్యక్రమం ఓ బ్రోతల్‌ స్వర్గమమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెడ్‌లైట్‌ సంస్కృతిలాంటిదంటూ నారాయణ కలకలం రేపారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మరోసారి కోర్టుకు వెళతానని వెల్లడించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ముద్దులు పెట్టుకుంటున్నారంటూ.. డేటింగ్‌ చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.