సాయుధ పోరాట వీరనారి, పేద ప్రజల కోసం చివరి వరకు తపించిన మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం.సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్..

నల్గొండ జిల్లా..

ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులను నల్గొండ పట్టణంలో పరామర్శించి, ఆమె చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతు..

సాయుధ పోరాట వీరనారి, పేద ప్రజల కోసం చివరి వరకు తపించిన మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం

ఆమె ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారు

కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళా పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం

నైజాం కి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నాటి రోజుల్లోనే మహిళల పోరాట పటిమ ను ప్రపంచానికి చాటిన వీరనారి

సంపన్న కుటుంభం లో పుట్టినా అడవుల్లో చెట్ల నడుమ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బందూకు పట్టి పోరాటం చేశారు

జీవించినంత కాలం ప్రజల కోసం, పోరాటాలే జీవితంగా స్వరాజ్యం నిలిచారు

సంప్రదాయాల పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేసిన కాలంలోనూ ప్రపంచ స్థాయి గెరిల్లా పోరాటం లో ముందుండి నడిచారు స్వరాజ్యం

ఒక కమ్యూనిస్టు గా.. మార్క్సిస్టు గా నిరంతర పోరాటశీలిగా నిలిచారు

దేశ వ్యాప్తంగా భవిష్యత్ ఉద్యమాలకు స్వరాజ్యమే మా స్ఫూర్తి..