గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.

.

తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

కాగా, ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…