బీజేపీ వల్ల దేశ ఐక్యతకు ప్రమాదం కలుగుతుందు.. సీపీఎం నేత తమ్మనేని వీరభద్రం..

బీజేపీ వల్ల దేశ ఐక్యతకు ప్రమాదం కలుగుతుందని సీపీఎం నేత తమ్మనేని వీరభద్రం అన్నారు. ఆరెస్సెస్ సిద్ధాంతం చాలా ప్రమాదకరమైనదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని… ఆ పార్టీని అడ్డుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
బీజేపీకి వ్యతిరేకంగా తమ పార్టీ కార్యకలాపాలు ఉంటాయని… ఉద్యమాలను చేస్తామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్లకు బీజేపీ కట్టబెట్టిందని విమర్శించారు.
ఎర్రకోటపై ఎర్రజెండా అనేది తమ పార్టీ నినాదమని అన్నారు. పొత్తుల గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని చెప్పారు. ఎన్నికల సమయం వచ్చిన తర్వాత తాము ఎక్కడెక్కడ పోటీ చేస్తామో చెపుతామని…అప్పుడే పొత్తుల గురించి పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. టీఆర్ఎస్ తో కలవడం మునుగోడు ఎన్నిక వరకు మాత్రమేనని… భవిష్యత్తులో కలిసి పోటీ చేస్తామా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని… పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే పొత్తులపై నిర్ణయం ఉంటుందని అన్నారు.