క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య…

మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..

కీసర గ్రామానికి చెందిన సురేశ్‌ కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..