గులాబీ టెస్టులో భారత్‌ ఘన విజయం..

*గులాబీ టెస్టులో భారత్‌ ఘన విజయం*

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యాన్ని సాధించింది.
స్పిన్‌కు సహకరిస్తున్న వికెట్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌(3/26, 4/48), అక్షర్‌ పటేల్‌(6/38, 5/32) విజృంభించి టీమ్‌ఇండియాను గెలిపించారు.

సెకండ్‌ సెషన్‌లో భారత స్పిన్నర్లు మరింతగా విజృంభించడంతో ఇంగ్లాండ్‌ వందలోపే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్‌..భారత్‌కు 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 7.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(25: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌(15: 21 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌) ఆడుతూ పాడుతూ స్వల్ప టార్గెట్‌ను పూర్తి చేశారు.