టీమిండియా ప్రధాన కోచ్గా..వీవీఎస్ లక్ష్మణ్.!!.

తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించబోతున్నాడు. ఈ నెలాఖరులో టీమిండియా ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు వీవీఎస్ లక్ష్మణ్ను హెడ్ కోచ్గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సొగసరి బ్యాట్సమన్తో పాటు..సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే..మునీష్ బాలి కూడా ఐర్లాండ్ టూర్కు వెళ్లనున్నారు. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా కోటక్ వ్యవహరించనున్నాడు. మనీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా, సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ ముగ్గురు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ జట్టులో సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్లుగానూ వ్యవహరిస్తుండగా..వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అదే సమయంలో భారత సీనియర్ జట్టు ఇంగ్లాండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుండగా..ఆ టీమ్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉండనున్నాడు. ఇక జూనియర్ జట్టు ఐర్లాండ్తో జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ-20 మ్యాచులు ఆడనుంది. సౌతాఫ్రికాతో భారత్ టీ-20 సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఐర్లాండ్తో జరగనున్న టీ-20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. టీ 20లో రాణించే ప్లేయర్లనే ఎంపిక చేసే అవకాశం ఉండటంతో.. ఐపీఎల్లో రాణించిన ఆశలు పెట్టుకున్నారు.
జులై 7నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టీ 20లు,
5 వన్డే సిరీస్‌ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ టూర్ కొసం ముందుగానే టీమిండియా కసరతు చేస్తోంది….