న్యూజిలాండ్ ముందు 234 పరుగుల లక్ష్యం ఉంచిన టీమిండియా.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్..

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్‌ 283 పరుగులకు చేరుకోవడంతో కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు. దాంతో కివీస్ లక్ష్యం 284 గా నిర్ధేశించబడింది. ఇక ఈరోజు ఆట ముగియడానికి 4 ఓవర్ల ముందు బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ లో విల్ యంగ్ (2) వికెట్ ను న్యూజిలాండ్ జట్టు కోల్పోయింది. దాంతో ఈ నాలుగో రోజును కివీస్ 4/1 తో ముగించింది. ప్రస్తుతం టామ్ లాథమ్ (2), విలియం సోమర్విల్లే(0) క్రీజులో ఉన్నారు…..