సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చిన భారత ప్లేయర్ కేఎస్ భరత్…

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ (KS Bharat) (116 నాటౌట్‌; 165 బంతుల్లో 15×4) అజేయ సెంచరీతో ఫామ్‌ చాటుకున్నాడు.భరత్‌తో పాటు సాయి సుదర్శన్‌ (97), మానవ్‌ సుతార్‌ (89 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లాండ్‌ లయన్స్‌తో తొలి అనధికార టెస్టును భారత్‌-ఎ డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ జనవరి 25న ప్రారంభంకానుంది. అంతకంటే ముందే భారత్-ఎ, ఇంగ్లాండ్ లయన్స్‌ మధ్య అనధికార టెస్టులు జరుగుతున్నాయి. నాలుగో రోజు, శనివారం సెంచరీ చేసిన అనంతరం కేఎస్ భరత్ వినూత్నంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిస్తూ రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించిన విధానాన్ని అనుకరించాడు. ఈ దృశ్యాలు కాస్త కెమెరా కంటపడగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో (Ayodhya Ram Mandir) మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. జనవరి 16న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం (జనవరి 22న) మధ్యాహ్నం 12.30కు మొదలై ఒంటి గంటకు పూర్తవుతుంది. నగర శైలిలో నిర్మిస్తోన్న ఈ రామమందిరం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తంగా 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి…