105 టెస్టులు,500 వికెట్లు, అశ్విన్ అద్భుత రికార్డు..!

టీమ్ ఇండియాలో సీనియర్ క్రికెటర్. క్రీజులోకి దిగాడంటే చాలా సీరియస్ గేమ్ ఆడతాడు..
చాలా కమిట్ మెంట్ తో ఆడతాడు. ఆటపై ప్రేమ, గౌరవం, అభిమానం, అంకిత భావం ఉన్న అతికొద్దిమంది ఆటగాళ్లలో తను కూడా ఒకడంటే అతిశయోక్తి కాదు…

టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ(15)ని ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. భార‌త్ త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఓవ‌రాల్‌గా తొమ్మిదో ఆట‌గాడిగా నిలిచాడు..

అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలేను అవుట్ చేసి టెస్టు క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. రాజ్ కోట్ మైదానంలో మూడో టెస్ట్ లో ఈ మైలురాయిని దాటాడు.

అంతేకాదు టెస్టుల్లో 500 వికెట్లు వేగంగా తీసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 98 టెస్టుల్లో ఈ మార్క్ ని అశ్విన్ చేరుకుంటే, తనకన్నా ముందు అనిల్ కుంబ్లే ఉన్నాడు. తనకి 500 వికెట్లు తీయడానికి 105 టెస్టులు పట్టింది.