ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

*బస్సు, ట్రక్కు ఢీ.. తొమ్మిది మంది మృతి* :
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బబూరి వద్ద ఇసుక లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. మరో 27 మంది గాయపడ్డారు. ఓ ప్రైవేటు బస్సు 70 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రైచ్‌ వెళ్తున్నది.ఈ క్రమంలో గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో బబూరి గ్రామం వద్ద బస్సు డ్రైవర్‌ రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవులను తప్పించబోయాడు. దీంతో అదుపుతప్పిన బస్సు.. ఎదురుగా ఇసుక లోడుతో వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టిందని బారాబంకి ఎస్పీ యమునా ప్రసాద్‌ తెలిపారు. దీంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.