అయ్యయ్యో వద్దమ్మా అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న శరత్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి..!..

R9TELUGUNEWS.com
అయ్యయ్యో వద్దమ్మా అంటూ ఓవర్‌ నైట్‌లో సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయిన ‘డాన్సర్‌ శరత్‌’ అందరికీ తెలుసు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, మోజ్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ చూసినా అతని డాన్సు.. అతని మాటలే వినిపించాయి.

ఎంత ఫేమస్‌ అయిపోయాడు అంటే ఒకప్పుడు నా వీడియోస్‌ను వైరల్‌ చేయండి అని వేడుకున్న శరత్‌.. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్‌ అయిపోయాడు. అంత ఫేమస్‌ అయ్యింది మాత్రం అయ్యయ్యో వద్దమ్మా అనే యాడ్‌తోనే. కానీ, ఇప్పుడు ఆ యాడే అతనికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. శరత్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో డాన్సర్‌ శరత్‌కు బాగానే గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి…

కొట్టింది ఎవ్వరూ…?…హిజ్రా లేనా మరేదైనా కారణాలు..?

మొట్టమొదటిసారిగా యాడ్స్ లో హిజ్రా వేషం ధరించి రావడం జరిగిందని దాన్ని కొద్దిగా కించపరిచేలా వక్రీకరించి ఉంటారు అనే భావనలో హిజ్రాలు ఉన్నట్లుగా కొందరు భావిస్తున్నారు..
హిజ్రాలపై గౌరవం పెరిగేలా ఒక టీపొడి యాడ్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ టీ పొడి యాడ్‌ను మాస్‌ డాన్సర్‌ శరత్‌ రీ మేక్‌ చేస్తూ తీన్మార్‌ డాన్సు చేశాడు. హిజ్రాలను కించపరిచాడు అనే భావనతో హిజ్రాలు శరత్‌పై దాడి చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. అతడిపై జరిగిన దాడిని కొందరు ఎంజాయ్‌ చేస్తూ మీమ్స్ కూడా చేశారు. సడెన్‌గా అతడు ఫేమస్‌ అవ్వడం కొందరికి నచ్చకే అలా ట్రోల్‌ చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు అన్న దానిపై క్లారిటీ రాలేదు. శరత్‌పై దాడిని కొందరు సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. మరోవైపు దాడి జరిగినట్లు చెప్తున్న వ్యక్తి డాన్సర్‌ శరత్‌ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. అతనే స్వయంగా ఒక అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…