తాగొచ్చి వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తున్న కొడుకు… క్షణికావేశంలో దాడి చేసిన తండ్రి కోడుకు మృతి… 80 శాతం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపించిన పోలిస్ లు…

సూర్యాపేట జిల్లా..

గరిడేపల్లి మండలం కీతవారిగూడెం లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనా…..
తాగొచ్చి వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేస్తున్న కొడుకు…
తండ్రీ , కొడుకుల మధ్య వివాదం క్షణికావేశంలో కొడుకు ను కొట్టిన తండ్రి,… అక్కడికక్కడే కొడుకు(యల్లవుల నాగరాజు) 32. మృతి… ఐదు సంవత్సరాల క్రితం నాగరాజు భార్య మృతి.. భార్యా మృతి తర్వాత నిత్యం మద్యానికి బానిసైన మృతుడు నాగరాజు.. మృతుడు నాగరాజు తరచుగా మధ్యం తగివచ్చి తల్లిదండ్రులను వేధించడంతో విసుగు చెంది తండ్రీ కొడుకుల మధ్య వివాదం తారాస్థాయి కి చేరుకోవడంతో కోపంలో చేతికందిన గొడ్డలితో బలంగా కొట్టగా నాగరాజు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. బయటకి పొక్కకుండా దహన సంస్కారాలు నిర్వహించారు.. 108కి సమాచారం ఇవ్వడంతో విషయం బయటికి వచ్చింది.. అయితే ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.. పోలిస్ లకు బుధవారం ఉదయం 10 గంటలకు తెలిసినట్లుగా సమాచారం..!!!
హుజూర్ నగర్, కితవారిగూడెం వెళ్ళే దారి మధ్యలో దహన సంస్కారాలు నిర్వహించారు..
అప్పటికే 80 నుండి 90 కాలిపోయిన మృతదేహం… పోలీసులు దహన సంస్కారాల వద్దకు వెళ్లి 80శాతం దహనం అయిన మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు….. మృతికి కారకులైన తండ్రిపై దహన సంస్కారాలకు సహకరించిన బంధువుల పై కేసు నమోదు చేశారు..