రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం బైక్ లిఫ్ట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణ హత్య..!!
సూది మర్డర్ కేసును పోలీసులు 24 గంటల్లోనే తేల్చారు...
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం బైక్ లిఫ్ట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే జమాల్‌సాహెబ్ హత్యకు కారణమని తేల్చారు. ప్రధాన నిందితులైన జమాల్ సాహెబ్ భార్య ఇమామ్‌బీ సహా మోహన్‌రావు, వెంకటేశ్, వెంకట్‌లను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంలో రెండు నెలల ముందే జమాల్ హత్యకు కుట్రపన్నారని తెలిపారు. భర్తను చంపేందుకు భార్య ఇమామ్‌బీ ఇంట్లోనే ఇంజక్షన్ దాచిపెట్టిందని పోలీసులు చెప్పారు..చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ఈ నెల 19న ముదిగొండ మండలం వల్లభి సమీపంలో ఇంజక్షన్ దాడిలో మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న జమాల్‌ను వల్లభి దవాఖాన సమీపంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. దీంతో అతడిని బైక్‌పై ఎక్కించుకున్నారు. వెనక కూర్చున్న వ్యక్తి ఇంజెక్షన్ ఇవ్వడంతో జమాల్ మృతిచెందారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వివాహేతర సంబంధమే దీనికి కారణమని నిర్ధారించారు…
ఇంజెక్షన్ ద్వారా మత్తుమందును హై డోసేజి ఇవ్వడం ద్వారా హత్యకు గురైన జమాల్ (చనిపోయిన వ్యక్తి ) భార్యతో.. సూది ఇచ్చిన వ్యక్తికి గల సంబంధంపై పోలీసులు దృష్టిసారించారు. ఆ దిశగా ఆధారాలను రాబట్టారు. సీసీ ఫుటేజి, సెల్‌ఫోన్ లొకేషన్, కాల్‌డేటా ద్వారా కీలకమైన వివరాలను సేకరించారు. జమాల్ అడ్డుగా ఉన్నాడని హత్య చేసినట్లు అనుమానించిన పోలీసులకు సీన్‌ఆఫ్ అఫెన్స్‌లో ఉన్న తీవ్రత, ఇంటెన్షన్ ఆధారంగా కేసును ఓ కొలిక్కి తెచ్చారు.
చింతకాని మండలం బొప్పారానికి చెందిన జమాల్‌సాహెబ్ తన కుమార్తెను చూడడానికి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై నిమిషాల వ్యవధిలోనే స్పందించారు పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగిందని గుర్తించారు.
హత్యలో ప్రత్యక్షంగా, పరోక్ష భాగస్వామ్యం ఉన్న వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన గోద మోహనరావు, అతని స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింశెట్టి వెంకటేష్‌తో కలసి ఆర్‌ఎంపీ వైద్యుడైన బండి వెంకన్న సహకారంతో అత్యధిక డోసేజి ఉన్న మత్తుమందు ఇంజెక్షన్‌ను సిద్ధం చేసుకుని జమాల్ సాహెబ్ ను హత్య చేసినట్టు తేల్చారు. మొత్తం నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.