ఆ ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దు.

హైదరాబాద్‌:- ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సైబరాబాద్‌ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం.. ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నిందితుల నివాస ప్రాంత వివరాలను పోలీసు కమిషనర్‌కు ఈరోజు సాయంత్రం 6లోపు తెలపాలని ఆదేశించింది.

ఈ కేసులో ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డితో పాటు సంబంధం ఉన్న ఇంకెవరితోనూ సంప్రదింపులు జరపవద్దని ఆదేశించింది.