తల్లి,భార్య, కుమార్తెను చంపి ఉరేసుకున్నాడు!!..

తార్నాకలో కుటుంబానికి చెందిన నలుగురు మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక రూపాలీ అపార్ట్‌మెంట్‌లో నివసించే ప్రతాప్ (34) కుటుంబం గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మృతుల్లో ప్రతాప్, సింధూర(32), ఆద్య(4), ప్రతాప్ తల్లి ఉన్నారు. ప్రతాప్ చెన్నైలోని ఓ కారు షోరూములో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. సింధూర.. హయత్నగర్ లోని ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వీరు నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబం మొత్తం ఆత్యహత్యకు పాల్పడిందని తొలుత అందరూ భావించారు. పోలీసులు కూడా అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఆనవాళ్లు.. మృతదేహాలను పరిశీలించిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రతాప్ తన కుటుంబాన్ని చెన్నైకి షిప్ట్ చేయాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని భార్య సింధూరకు చెప్పాడు. ఆమె వినకపోవడంతో సింధూరపై ఒత్తిగి పెంచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూర.. చెన్నైకి వెళ్లేందుకు నిరాకరించినట్లు సమాచారం. చెన్నైకి షిఫ్ట్ కావాలనే విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో భార్య సింధూర, కూతురు ఆద్య, తల్లి రజతిని ప్రతాప్ చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రతాప్ తన తల్లిని గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులకు ఆధారాలు లభించాయి. ముగ్గురిని చంపిన తర్వాత ప్రతాప్ ఉరివేసుకున్నాడు. రాత్రి కూడా చెన్నై విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రే భార్యను హత్య చేసి తర్వాత కూతుర్ని చంపినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున తల్లికి ఉరివేసి చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని సింధూర తల్లి వాపోయారు. సింధూర చాలా ధైర్యంగా ఉండేదని, ప్రతాప్ తమకు దగ్గర బంధువని తెలిపారు..