ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం…

ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం..

అవుషాపూర్ లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో భర్తకు మద్యం లో గుర్తుతెలియని విషం కలిపిఇచ్చిన భార్య..

తాగిన కొద్ది సేపటికే కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన భార్య…

చికిత్స పొందుతూ మృతి.. గ్రామస్థులను సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసిన భార్య

అనుమానం తో పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు..

వివాహితలు ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చుతున్నారు. ఆ తరువాత వారి హైడ్రామా పీక్స్‌లో ఉంటోంది. చూసిన వారంతా వారిపై పెద్ద ఎత్తున సింపథీ కురిపిస్తున్నారు. తరువాత అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. ఈ ఘటనలో కూడా భర్తకు విషం ఇచ్చి ఆపై ఏమీ తెలియనట్టు హైడ్రామా నడిపించిందో మహిళ. తరువాత గ్రామస్థులకు ఎందుకో డౌట్ వచ్చింది. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అంతే అసలు విషయం పోలీసులే రాబట్టారు.

ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అవుషాపూర్‌లో ఓ వివాహిత వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించింది. విషయాన్ని ప్రియుడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసి స్కెచ్ గీశారు. ప్రియుడి సలహా మేరకు భర్తకు మద్యంలో గుర్తు తెలియని విషం కలిపి ఇచ్చింది. తాగిన కొద్ది సేపటికే కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో హుటాహుటిన భార్య ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అక్కడ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. ఆపై సదరు మహిళ హైడ్రామాకు తెరదీసింది. గ్రామస్థులను సాధారణ మరణంగా నమ్మించే యత్నం చేసింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానమున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యను అదుపులోకి తీసుకుని ఘట్ కేసర్ పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించారు.

భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఘట్ కేసర్ పోలీసులు

ప్రియుడు సూచన మేరకు విషంతో కూడిన మద్యం ఇచ్చినట్టు ఒప్పుకున్న భార్య

గురువారం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టానున్న పోలీసులు