ఏలూరు జిల్లాలో దారుణం.. నాలుగు నెలలుగా బాలికపై గ్యాంగ్ రేప్‌..!

*ఏలూరు జిల్లా.. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. మండవల్లి బీసీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ స్కూళ్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.

నాలుగు నెలలుగా ఆ బాలికపై వీరు అత్యాచారం చేస్తున్నట్టు సమాచారం. కాగా వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉండగా, మరో వ్యక్తి స్వయంగా ఆ బాలిక అన్నయ్యగా సమాచారం అందుతోంది.
ఇక.. ఆ బాలుడు కూడా బాలిక చదువుకునే స్కూళ్లోనే 7వ తరగతి చదువుతున్నట్టు సమాచారం. ఇందులో ఒకరు బాలిక సొంత అన్నయ్య (పెద్దమ్మ కొడుకు), కాగా, మరో వ్యక్తి మండవల్లి మండలం భైరవపట్నం చెందిన లారీ డ్రైవర్ ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన బాలిక అన్నయ్య కోసం గాలింపు చేపట్టారు…