ఏలూరు జిల్లాలో దారుణ ఘటన..కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన వైద్యులు.

ఏలూరు జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాన్పుకు వచ్చిన గర్భిణికి సిజేరియన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. బాధితురాలికి కడుపు నొప్పి వీపరీతంగా రావడంతో ఎక్స్ రే తీయడంతో వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కాగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వారం క్రితం కాన్పు నిమిత్తం మహిళ రాగా పరీక్షలు నిర్వహించిన సీనియర్ సర్జన్ ఆమెకు సిజేరియన్ చేశారు. మహిళకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరచిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. డీసీహెచ్ఎస్ ను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.