బురఖా వేసుకుని మహిళల టాయిలెట్లోకి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్…..

బురఖా వేసుకుని మహిళల
టాయిలెట్లోకి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్…

*కేరళ. కేరళలోని కొచ్చిలోని లులు షాపింగ్ మాల్లో బురఖా ధరించి ఒక వ్యక్తి మహిళల టాయిలెట్లోకి ప్రవేశించాడు..

అంతే కాకుండా ఫోన్లో వీడియోలు రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను లోపల డోర్కు ఫిక్స్ చేశాడు. బయటికొచ్చిన అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారొచ్చి విచారించగా పురుషుడని తేలింది. అతడిని అరెస్ట్ చేసి, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.