భార్య మీద కోపంతో కన్న కూతుర్లను చంపుతున్న కసాయి తండ్రులు

భార్య మీద కోపంతో కన్న కూతుర్లను చంపుతున్న తండ్రులు..

కన్న పేగులే యమపాశంగా మారుతున్నాయి.. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని ఈ సమాజంలో ఆడవారికి కన్నవారు కూడా యమపాశం లానే మారారు… చిన్న చిన్న కుటుంబ సమస్యలతో కూడా అన్నం పుణ్యం తెలియని పిల్లల్ని హత మారుస్తున్న ఘటనలు ప్రస్తుతం ఎక్కువ జరుగుతున్నాయి,
ఇటీవల హైదరాబాద్‌లో భార్య మీద కోపంతో 9 ఏళ్ళ కూతురుని స్కూల్ నుండి తీసుకెళ్ళి చంపిన తండ్రి ఉదంతం మరువకముందే ఇదే తరహాలో ఒంగోలు జిల్లా కనిగిరికి చెందిన నిందితుడు వెంకటేశ్వర్లు భార్య వెంకటనరసమ్మ మీద కోపంతో కూతురు మంజుల (13)ను స్కూల్ నుండి తీసుకెళ్ళి బండ రాళ్లతో కొట్టి చంపాడు..