యూకేజీ చదువుతున్న బాలుడిని టీచర్ కొట్టడంతో అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. హోం వర్క్ రాయలేదని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
రామంతపూర్ డివిజన్ వివేక్ నగర్ స్ట్రీట్ నెంబర్10 కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో హేమంత్(UKG) చదువుతున్నాడు.
రామంతపూర్ వివేక్ నగర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ అనే విద్యార్థి యూకేజీ చదువుతున్నాడు. శనివారం హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వెళ్లాడు. దీంతో టీచర్ బాలుడి తలపై పలకతో కొట్టింది. దీంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు.
. మరుసటి రోజు నుండి తీవ్ర అస్వస్థతో ఇబ్బందిపడటంతో బాలుడి పేరెంట్స్ ప్రయివేటు హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. చనిపోయిన బాలుడి మృతదేహాన్ని స్కూల్ ముందు పెట్టి తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళన చేపట్టారు…దీనిపై స్పందించిన యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వారు వనపర్తికి తరలించారు. గత కొంత కాలంగా హేమంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చుట్టుపక్కల వారు చర్చించుకుంటున్నారు…