నలుగురి ప్రాణం తీసిన అక్రమ సంబంధం
కడప పులివెందుల పట్టణానికి చెందిన టి.వెంకటేశ్వర్(51) 2పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్(రైటర్) విధులు నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్వర్ భార్యకి తెలియకుండా రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం ఇంట్లో తెలిసి తరుచు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. వెంకటేశ్వర్ జూన్ 26వ తేదీన 20 లక్షల విలువ చేసే భూమి రమాదేవి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాడు.
పథకం ప్రకారమే రెండు బాండ్ పేపర్లపై తన మరణాంతరం తన ఆస్థి, పెన్షన్ పథకం, కోరితే తన ఉద్యోగం రమాదేవి కుమారుడికి ఇవ్వాలని రాసి బుధవారం రాత్రి తన భార్య మాధవిని(47), ఇద్దరు కూతుళ్లు లాస్య(19), అభిజ్ఞ(16)లను తుపాకీతో కాల్చి తనను కాల్చుకొని చనిపోయాడు.