ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవళిక – హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు..

ప్రియుడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవళిక – హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు..

మర్రి ప్రవళిక 23, వరంగల్ జిల్లా బిక్కాజీ పల్లికి చెందిన అమ్మాయి గ్రూప్స్ కోచింగ్ కోసం.. అశోక్ నగర్ లోని బృందావన్ గల్స్ హాస్టల్ లో 15 రోజుల క్రితం జాయిన్ అయ్యింది.

ఆమెకు హాస్టల్లో శ్రుతి, సంధ్య అనే స్నేహితులు ఉన్నారు వారిని విచారించాము. నిన్న రాత్రి అమ్మాయి ఒక్కతే రూమ్లో ఉన్నపుడు చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది…

ప్రవళిక సూసైడ్ నోట్ రాసి ఉంది. అమ్మాయి మొబైల్ చూస్తే.. అందులో ఒక చాటింగ్ ను గమనించాము. కోస్గి మండలానికి చెందిన శివ రామ్ రాథోడ్ అనే అబ్బాయి తో ప్రైవేట్ చాటింగ్ చేసిందని గుర్తించాం…

నిన్న ఉందయం బాలాజీ దర్శన్ హోటల్లో వీరిద్దరూ టిఫిన్ చేశారు.ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించాము…

ఈ అబ్బాయి ( శివ రామ్ ప్రియుడు ) వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడని ఆ చాటింగ్ లో తెలుసుకున్నాం. తనను మోసం చేశాడని.. ప్రవళిక మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించాము…

ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. గతంలో వారు మందలించారు. ప్రవళిక సూసైడ్ లెటర్, చాటింగ్ ఫోరెన..

ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. గతంలో వారు మందలించారు. ప్రవళిక సూసైడ్ లెటర్, చాటింగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాము…

ఆ నివేదిక అనంతరం ప్రియుడు శివరాం పై కేసు నమోదు చేస్తాం. ఈ ఘటనను వేరే ఇష్యూ తో ముడిపెడుతున్నారు…

స్థానిక విద్యార్థులు..విద్యార్థి సంఘం నాయకులు.. లీడర్స్ ధర్నా చేశారు. నిన్న ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేశాం…