ఖైదీ కడుపులో బ్లెడ్ల్, మేకులు..!!

*ఖైదీ కడుపులో బ్లెడ్ల్, మేకులు*

చంచల్‌గూడ జైలు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉంటుంది. అందులో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్నవారు ఉన్నారు. అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లా డిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానం టూ కేకలు వేశాడు.

జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.

ఎక్స్ రే పరిశీ లించగా.. కడుపులో షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు.. ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు.

ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు పంపిం చారు.గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయ వంతంగా బయటకు తీశారు.

అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలి పారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూప రింటెండెంట్‌ అభినందిం చారు.

అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచా రించి.. అతనికి మానిసి కపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే.. ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు