కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు..!!

*కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు..*

విశాకు చెందిన ఫొటోగ్రాఫర్ దారుణహత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి సాయి కుమార్ అనే యువకుడ్ని హత్య చేశారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెం సమీపంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా మెస్సేజ్ చేసి పిలిచి ఫొటోగ్రాఫర్ (Visakhapatnam Photographer) సాయికుమార్‌ను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి సాయి కుమార్‌ను హత్య చేశారు…

ఆన్‌లైన్‌లో ఫొటోషూట్ ఆర్డర్..
విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌(23) ఫొటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్, మ్యారేజ్, ఇతర ఫంక్షన్లకు ఫొటో షూట్, వీడియోలు తీస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా ఈవెంట్, ఫంక్షన్లకు ఆర్డర్ చేస్తే.. వేరే ప్రాంతాలకు సైతం వెల్లి సాయికుమార్ ఫొటోషూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫేస్ బుక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇద్దరు యువకులు ఫొటోషూట్ ఉందని సాయికుమార్ ని అడిగారు. ఈ యువకులు బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందినవారు. ఓ 10, 15 రోజులపాటు వెడ్డింగ్ ఫొటోషూట్ ఉందని ఫిబ్రవరి 26న అతడ్ని పిలిచారు. తన వద్ద ఉన్న విలువైన కెమెరా, ఇతర సామాగ్రితో సాయికుమార్ మధురవాడ నుంచి కోనసీమ జిల్లా రావుల పాలెం వెళ్లాడు.