చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య..

అరకులోయ సమీపంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి వివరాలు ఆరా తీశారు.

వీరిద్దరూ మైనర్లని, రాజమండ్రి సమీపంలో హుకుంపేట ప్రాంతానికి చెందిన జ్యోత్స్న(14), చైతన్య గా(17) గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.