వైద్యం వికటించి బాలుడు మృతి..!

*సూర్యాపేట జిల్లా* .

హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరా హాస్పిటల్ సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల, గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిద్ధార్థ (5) సంవత్సరాల బాలుడు మృతి..

తల్లి శిరీష తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం వాంతులు విరోచనాలు అవుతుండగా హుజూర్నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని, డాక్టర్ గారు వస్తారు ఆగండి అంటూ, సిబ్బంది ట్రీట్మెంట్ అందించారని,, డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ఉండడంతోటే తన కుమారుడు చనిపోయాడు అంటూ తల్లి శిరీష కన్నీటి పరితమై వెల్లడించారు.. తన బాబు దాదాపు చనిపోతున్న సమయంలోనే అంబులెన్స్ లో ఎక్కించారని ,, ఉదయం ఒక ఇడ్లీ కూడా తిన్నాడని, టీ కూడా తాగడం జరిగిందని,, అలాంటి నా కొడుకుని ఏదో తెలిసి తెలవని వైద్యం చేసి ప్రాణాలు తీశారు అనీ అన్నారు…. తన బాబు చనిపోవడానికి కారణం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..