డ్రైవింగ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్…ముగ్గురు మృతి..

ట్రాక్టర్ డ్రైవర్ కు హెర్త్ ఎటాక్ రావడంతో ముగ్గురు చనిపోయిన దుర్ఘటన యదాద్రి భువనగిరి జిల్లా సమస్టాన్ నారాయణపురం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని శేరిగూడెం గ్రామంలో ఇటుకలను అన్లోడ్ చేసుకొని వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్య కు హెర్త్ ఎటాక్ రావడంతో డ్రైవింగ్ సిట్ లోనే మృతి చెందాడు. నియంత్రణ కోల్పోయిన ట్రాక్టర్ పక్కన ఉన్న గుంటలో పది పల్టీ పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ పై కూర్చున్న సీతారాం మరియు దుర్గ అనే ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరంతా ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఇటుకల బట్టీలో కూలీలుగా ఉంటున్నారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను చౌటుప్పల మార్చరీకి, గాయపడిన వారిని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు