పేకాట ఆడుతూ పట్టుబడిన బాలయ్య పిఎ… పిఎ తో పాటు బాలయ్య ప్రత్యర్థులు కూడా ఉన్నారట…!!

పేకాట ఆడుతూ పట్టుబడిన బాలయ్య పిఎ
కర్ణాటక లోని గౌరిబిదనూరు లో కేసు
ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ పీఏ గా ఉన్న బాలాజీతో పాటు మరి కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు పోలీస్ స్టేషన్లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదయింది. పన్నెండు మంది ఉపాధ్యాయులు, పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుంచి
ఒక లక్ష యాభై వేలు నగదును గౌరిబిదనూరు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు….

వైసీపీ నేతలతో పేకాట ఆడుతున్నట్లు ప్రచారం..!!

బాల‌కృష్ణ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తే పీఏ బాలాజీ వైసీపీ నేత‌ల‌తో క‌లిసి పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది…చిక్‌బళ్లాపూర్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి, 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలకృష్ణ పీఏ బాలాజీతోపాటు హిందూపురం వైసీపీ మండ‌ల క‌న్వీన‌ర్‌తో పాటు అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌లువురు గ్రామ‌స్థాయి రాజ‌కీయ నాయ‌కులు కూడా ప‌ట్టుబ‌డ్డారు. .వైసీపీ నేత‌ల‌తో క‌లిసి హీరో బాలయ్య పీఏ అరెస్ట్ పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డ‌డంపై టీడీపీ, ఏపీ అధికార పార్టీ నాయ‌కులు ఆశ్చ‌ర్య పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు పీఏ బాలాజీపై విమ‌ర్శిలు గుప్పిస్తున్నారు. ఎంతో న‌మ్మ‌కంతో నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, వైసీపీ నేత‌ల‌తో అంట‌కాగ‌డం ఏంట‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటివ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మే అని మ‌రికొంద‌రు కొట్టి పారేస్తున్నారు.