నాన్న..దుబాయ్‌ నుంచి రాంగానే సెల్‌ఫోన్, టీవీ తీసుకురా……బిడ్డా నువ్వు వెళ్లిపోయావా…రోదించిన తండ్రి…

ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు మృతి..

‘నాన్న.. దుబాయ్‌ నుంచి రాంగ సెల్‌ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్‌ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్‌.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే.

చివరిచూపు కోసం..చెరువులో ఆదివారం చెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్‌ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్‌ మృతదేహానికి తండ్రి సతీశ్‌ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్‌కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్‌ నుంచి తండ్రి కిషన్‌ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది.