భువనగిరి లో పరువు హత్య కలకలం రేపింది..

భువనగిరి లో పరువు హత్య కలకలం రేపింది..యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన భార్గవి, వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన మాజి హాంగార్డ్ ఎరుకల రామక్రిష్ణ రెండేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు… ఓ కెస్ లో సస్పెండ్ అయిన రామకిష్ణ తన భార్యతో కలిసి భువనగిరిలోని తాతానగర్ లో ఇళ్ళు అద్దెకు తీసుకోని జీవిస్తున్నారు..రియల్ ఎస్టెట్ బిజినెస్ చేస్తూ రామక్రిష్ణ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు… అయితె గురువారం రోజు లతీఫ్ అనే వ్యక్తి ముగ్గురు మహిళలతో కలిసి ప్లాట్స్ కొంటామని సైట్ చూయించాలని చెప్పి రామక్రిష్ణను కారులో ఎక్కించుకోని హైద్రాబాద్ కు తీసుకుపోయాడు..ఆ రోజు నుంచి రామక్రిష్ణ అద్రుశ్యం అయ్యాడు… శుక్రవారం రామక్రిష్ణ భార్య భార్గవి తన భర్త కనబడటం లేదని భువనగిరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది..కెస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..అయితె ఇవ్వాల సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం సమీపంలో రామక్రిష్ణ మ్రుతదేహాన్ని కొనుగొన్నారు…… ..అయితె తన భర్తను తన తండ్రి వెంకటేశ్వర్లు లతీఫ్ అనే రౌడీ షీటర్ చేత చంపించాడని పోలీసులకు పిర్యాదు చేసింది భార్గవి……కులాంతర వివాహం చేసుకున్న తన కూతురిని తండ్రి వేంకటేశ్వర్లు మెదటి నుంచి వ్యతిరేఖిస్తూ వచ్చాడు..కొన్నాళ్ళ క్రితం భార్గవిని కిడ్నాప్ చేసుకుందుకు వేంకటేశ్వర్లు యత్నించాడు…అయితె ఈ నేపద్యంలోనే తన భర్తను తన తండ్రి వేంకటేశ్వర్లు హత్య చేయించాడని అంటున్నది భార్గవి…. 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… విచారణ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని భువనగిరి పోలీసులు చెప్తున్నారు…….