ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ భార్యా బాధితుడయ్యాడు.!!!..

హర్యానాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ భార్యా బాధితుడయ్యాడు. పురుషులు కూడా గృహహింసకు గురవుతారన్న దానికి నిదర్శనంలా నిలిచాడు. అజిత్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాలోని ఖర్కారా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అతడికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియోలో అజిత్ యాదవ్ ను అతడి భార్య సుమన్ యాదవ్ ఇల్లంతా తిప్పి కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. కొడుకు చూస్తుండగానే ఆ ఇల్లాలు భర్తపై చేతికందిన వస్తువులతో దాడికి దిగింది. ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ, తమకు ఏడేళ్ల కిందట వివాహం జరిగిందని, తమది ప్రేమ వివాహం అని తెలిపాడు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక్కసారి కూడా భార్య సుమన్ పై చేయిచేసుకోలేదని వివరణ ఇచ్చాడు. భార్య చేతిలో తాను దెబ్బలు తినాల్సి వస్తోందని, ఆమె తనను కొట్టడం ఎక్కువైందని వాపోయాడు. దాంతో ఆధారాల కోసం ఇంట్లో సీసీటీవీ కెమెరాలు బిగించానని, వాటిలో నమోదైన ఫుటేజిని కోర్టుకు సమర్పించానని అజిత్ యాదవ్ వెల్లడించాడు. దాంతో స్థానిక కోర్టు తనకు భద్రత కల్పించేందుకు అంగీకరించిందని తెలిపాడు….